అనగనగా ... ఒక బాబు. బాబుకి పేరేం పెడదాం చెప్మా....హా...మీరు ఊహించిందే .. గవ్వగాడు!!!
గవ్వాగాడు జయప్రదంగా చదువు అయ్యింది అనిపించాడు. ఇంక సినిమా హీరోలా హైదరాబాద్ ని ఎల్దాం అని ఎర్ర బస్సెక్కి లకిదికాపూల్ లో అడుగుపెట్టాడు. ఏదో సినిమా లో జూనియర్ ఎన్ టి ఆర్ సన్నివేశం గుర్తుకొచ్చింది. ఇద్దరిదీ ఒకటే పొడవు అలానే చెయ్యాలి అని, అమాంతంగా కిందకివంగి ముద్దు పెట్టేశాడు. హమ్మయ్య ఇక మనకు తిరుగులేదు అని బయలుదేరాడు. అయితే ఆమడ దూరంలో ఒక చిన్న కుక్క వీడు చేసిన పని చూసి, "ఏంటో, నేను రోజూ వెళ్లే చోటు ఇంత పవిత్రమైనది అని నాకు తెలియదు" అనుకోని వాడినే అలా చూస్తూ ఉండిపోయింది.
అలా కొన్ని రోజులకు మొత్తమ్మీద ఒక గది బాడుగకు తీసుకొని, ఒక ఉద్యోగం కూడా సంపాదించాడు. వెంటనే, గవ్వాగాడు వాడి తమ్ములని కూడా తీసుకువచ్చి గదిలో పెట్టుకున్నాడు. అయితే మనవాడికి గది యజమాని అంటే ఇష్టం ఉండేదికాదు. నేను కట్టే అద్దెకి వీడు కనీసం మంచు పెట్టే (అదేనండి ఏసీ) కూడా ఇవ్వలేదు అని, ప్రతి నెలా కచ్చితంగా ఒకటో తారేకుకే బాడుగ కట్టమంటాడని, రాత్రి 10 దాటితే తలుపుకి తాళం వేసేస్తాడని, స్నేహితులని తీసుకువస్తే వద్దంటాడని ఇలా చాలానే విషయాల్లో నచ్చేవాడు కాదు. పైగా... వీడు కట్టే అద్దె మీదే వాడు కార్లు బంగళాలు కట్టేస్తున్నా డు అని తెగ ఆలోచించేవాడు.
ఇక వీడి తమ్ముళ్ళ విషయానికి వద్దాం. వాళ్ళ పేర్లు ముద్దుగా అప్పం, బప్పం అనుకుందాం. బప్పం అందరికంటే చిన్నవాడు. ఏదో అనుకునేరు, ఆన్నయ్య గవ్వ కే అన్ని కళలుంటే, బప్పం గురించి గ్రంధాలు రాయొచ్చు. అప్పం కూడా తక్కువేం తినలేదు. ఎవడికాడు అన్నమాట.
సరే, అలా కొన్నిరోజుల గడిచాయి. ఒక రోజు ముగ్గురు కలిసి మాట్లాడుకుంటున్నారు, "ఒరేయ్ మనం ఇచ్చే అద్దెకి వీడు చాలా ఎక్కువ చేస్తున్నాడు, కొత్త గది చూసుకుందాం" అని అనుకున్నారు. వెంటనే మన బప్పం లేచి, "ఈ చుట్టుపక్కల అంతా మనకి కొట్టిన పిండి, ఒక గంటలో కొత్త గది చూపిస్తా" అన్నాడు. అప్పం గాడు వెంటనే, "ఏరా ఏదో చదువుతున్నావు అనుకున్న, బాడుగకు గదులు చూపించే బ్రోకర్ పని చేస్తున్నావని అనుకోలేదు అన్నాడు అమాయకంగా". అంతే, బప్పంకి ఎక్కడలేని రోషం వచ్చింది, బయటకి విసురుగా వెళ్తూ, కోపం తెలియాలని గది తలుపు విసిరికొడుతు బయటకి వెళ్ళిపోయాడు. బయటకి వెళ్ళి, తనలో తాను అనుకుంటున్నాడు, ఈ అప్పం అన్నగాడు నేను చదువుకోడానికి వెళ్ళడం లేదు అని తెలిసి అన్నాడా, లేక ఏదో అలా అనేసాడా? అనుకుంటున్నాడు. రోడ్ మీదకు రాగానే, ఎదురింటి పిల్ల కెవ్వ్ అని అరిచి పారిపోయింది. బప్పంకి అర్థం కాలేదు. వెనకనుంచి ఎవరో తిడుతున్నట్టు అనిపించింది, చూస్తే కింది వాటాలో మామ్మ గారు. "నిష్ట దరిద్రుడా, దున్నపోతు లా అంత ఉన్నావు, నిక్కరు వేసుకొని తగాలడొచ్చు కదా అని అన్నారు". చూట్టు ఎవరూ లేరు కదా ఈవిడ ఎవర్ని తిడుతోంది అని కిందకి చూసాడు. తాటి మొద్దులాంటి రెండు కాళ్ళు కనిపించాయి. బప్పంకి అర్థమైంది, తాను కోపంలో ఉందా లేదా అనిపించే లోచెడ్డి తో వీధిలోకి వచ్చేశాడు అని. తిరిగి పైకి పరుగు, మళ్లీ తలుపు విరిగేలా పెద్ద శబ్దంతో తోసుకుంటూ వెళ్ళి అప్పం మీద పడిపోయాడు.
ఇదంతా చూస్తున్న గవ్వ అన్న గుండెల్లో ఏదో కలుక్కుమన్నది. లేచి ఇద్దరు తమ్ముళ్ళని తిట్టటం మొదలు పెట్టాడు. "ఒరేయ్, ఆ ముష్టి ఓనర్ తలుపు శబ్ధం విన్నాడంటే, నా తలుపు విరిగిపోయింది అని మనల్ని డబ్బులు కట్టమంటాడురా" అంటూ, తలుపు వెయ్యడానికి గుమ్మం దగ్గరికి వెళ్ళాడు, ఎప్పుడొచ్చాు డో ఏమో, అంతా వింటూ ఉన్నాడు ఓనర్.
ఏదీ, ఒకసారి తలుపు తియ్యి అనుకుంటూ లోపలికి వచ్చాడు. వచ్చేసరికి, అప్పం, బప్పం ఒకరి మీద ఒకరిి ని చూసి, కంగారు పడ్డాడు. బప్పం కి బుద్ది లేదు కదా, చిలిపిగా నవ్వుకుంటూ వేరే గదిలోకి వెళ్ళిపోయాడు. అప్పం గాడు వొళ్ళంతా తడుముకుంటూ, ఏమన్నా విరిగాయ ఉన్నాయా అని చూసుకుంటున్నాడు. ఓనర్ కి వేరే లా అర్థం అయ్యింది.
ఓనర్ అంటున్నాడు, "బాబు గవ్వ, మీ అన్నదమ్మలు పద్ధతి కలిగిన, తెలిసిన వాళ్ళు అనుకున్న. మీరు చేసేది ఎంబాగలేదు, నా తలుపుకి 500/- ఇవ్వు, అలానే వేరే గదిని కూడా చూసుకోండి" అన్నాడు. మన గవ్వగాడికి, కోపం ఎప్పుడూ గవ్వ మీదే ఉంటుంది, సారీ, ముక్కుమీద ఉంటుంది, అంతే చెలరేగిపోయాడు. ఓనర్ నీ నానా మాట్లన్నాడు. కోపం వచ్చి ఓనర్ రోడ్డుమీద ఉన్న నలుగుర్ని పిలిచాడు. పిలిచి చూసింది, అన్నది, విన్నది చెప్పేశాడు. స్థానబలం కదా, సాయంత్రానికల్లా ఖాళీ చెయ్యమన్నాడు. గవ్వ కొంచెం తేరుకొని, సరే, మా అడ్వాన్స్ డబ్బులు ఇచ్చేయి, వెళ్ళిపోతాం అన్నాడు. ఓనర్, "ఒక్క రూపాయి కూడా ఇచ్చేదిలేది, నా ఇల్లంతా నాశనం చేశారు, మొత్తం బాగుచేయించుకోవాలి బయటకి పొమ్మనాడు". గావ్వగాడికి చూట్టూ ఉన్న జనాల్ని చూసి భయం వేసింది. ఒక రెండు మూడు రోజుల్లో మారతాం అని ఒప్పించాడు.
ఆ రోజు సాయంత్రం ముగ్గురు కూర్చొని, వేరే రూం చూసుకుందాం అని అనుకున్నారు. మళ్లీ బప్పం చూస్తాఅని అన్నాడు. కానీ గావ్వగాడు కోపంతో, పగతో, రగిలిపోతూ, ఈ ఓనర్నీ ఊరికినే వదలను అని ప్రతిజ్ఞ పూనాడు. ఓ రెండు రోజుల తర్వాత, బప్పం ఆపీసులో ఉన్న గవ్వన్నకి ఫోన్ చేసి, "రూం దొరికింది మేము మారిపోతున్న సాయంత్రం నువ్వు కొత్త రూంకి వద్దూగాని" అని చెప్పాడు. "కొత్త రూం ఎక్కడరా?" అన్నాడు గవ్వ. దానికి బప్పం, "నీకో సర్ప్రైజ్, రాత్రికి పాత రూం వీధి చివరికి వచ్చి కాల్ చెయ్యి" అన్నాడు. దానికి గవ్వగాడి ఉన్నట్టుండి ఒక పెద్ద మెరుపు లాంటి ఆలోచన వచ్చి, ఒరేయ్ నాకు చాలా పని ఉంది, రాత్రి ఆలస్యం అవుతుంది" అని ఫోన్ పెట్టేశాడు.
రాత్రికి గవ్వగాడు బప్పం చెప్పినట్టుగా పాత రూం వీధి దగ్గరికి వచ్చి బప్పం కి ఫోన్ చేసి ఎక్కడికి రావాలో అని అడిగాడు. బప్పం ఆవల నుంచి, "ఏంట్రా గవ్వన్న చాలా సంతోషంగా ఉన్నావు?" అన్నాడు. దానికి గవ్వగాడూ సంతోషాన్ని అదుపుచేసుకుంటు... "తరువాత చెప్తా గాని కొత్త రూం ఏ ఏరియా లో ఉందో చెప్పు?" అన్నాడు. దానికి బప్పం, "కొత్త ఏరియా లేదు తొక్కా లేదు, పక్క వీధిలో ఎడం వైపు మూడో ఇంటికి వచ్చేయి" అని ఫోన్ పెట్టేసాడు. గవ్వకి మొహం లో ఉన్న ఆనందం అంతా హుష్‌కాకి అన్నట్టుగా పోయి పచ్చి వెలక్కాయి తిన్న మోహంలా అయిపోయింది. కాల్లీడ్చుకుంటూ కొత్త రూం కి వెళ్ళి తలుపు తీసాడు. లోపల, దరిద్ర నారాయణ అవతారం లో బప్పం, లంగానా, లుంగినా? అనిపించే అవతారం లో అప్పమ్ కనిపించారు. గవ్వని చూసిన వెంటనే, "అదెంట్రా అన్నయ, ఫోన్లో చాలా ఆనందంగా ఉన్నావు, ఇప్పుడేమో చీకేసిన తాటి టెంకలా ఉన్నావు?" అని అడిగాడు.
"అదేం లేదు" అని దాటేసి గదిలోకి వెళ్ళిపోయాడు.
మరుసటి రోజు, ఉదయాన్నే 10 గంటలకి దభ దభా తలుపులు బాదుతున్న శబ్దానికి ముగ్గురూ నిద్ర లేచారు. గవ్వహాడు, టైమ్ చూసి పరుగు పరుగున పయాఖానకు వెళ్తూ, "ఒరేయ్ బప్పం చూడు ఎవరో, నాకు ఆఫీస్ కి ఆలస్యం అయ్యింది అన్నాడు". బప్పం తిట్టుకుంటూ "మనకి ఇక్కడ ఫ్యాన్స్ ఎవరో" అనుకుంటూ తలుపు గొళ్ళెం తీసాడు. ఎదురుగా పాత ఇంటి ఓనర్, మళ్లీ నలుగురు మనుషులతో ఉన్నాడు. ఓనర్, బప్పంతో అంటున్నాడు, " ఏరా అలంబండలా అంతున్నావు, జ్యోతిలక్ష్మి లా ఎప్పుడూ చూసిన అంత చిన్న చెడ్డి తప్ప ఇంకోటి వేసుకోవెరా?" అన్నాడు. దానికి బప్పం, పొట్ట గోక్కుంటూ, "ఇక్కడకెందుకొచ్చావు?" అన్నాడు. దానికి ఓనర్, "ముందు నీ అన్నని పిలు, చెప్తా" అన్నాడు. దానికి బప్పం, "ఒక గంట పట్టుద్ది, ఆడు ఇప్పుడే పయాఖానలోకి వెళ్ళాడు, మీరు బయట వేచి ఉండండి అన్నాడు.
ఒక గంటకి, బయటకి వచ్చి, ఏరా ఇందాక వచ్చింది ఎవరు అని అడిగాడు, దానికి బప్పం, "పాత ఇంటి ఓనర్ రా, వెళ్లు బయట ఉన్నాడు గంట నుంచి అన్నాడు. దానికి కంగారు పడి, "ఒరేయ్ నేను రూంలో లేను, ఆఫీసుకి వెళ్ళిపోయాను, ఒక రెండు మూడు రోజుల దాకా రాను అని చెప్పి పంపెయ్యరా" అన్నాడు. బప్పం నిద్రమోహంతో వెళ్ళి, ఎండలో ఉన్న ఓనర్ కి అలానే చెప్పాడు. ఓనర్, ఇక కల్లు తాగిన కోతిలా చెలరేగిపోయాడు, బప్పం నీ, గవ్వగాడిని బయటకి రమ్మని పిలిచి తిట్లదండకం మొదలుపెట్టాడు. ఇంతలో అప్పం బయటకి వచ్చి "ఎందుకండీ అలా గొడవ పెడుతున్నారు? మీ రూం ఖాళీ చేసేసాం కదా? పైగా మీరే మా అడ్వాన్స్ ఎగ్గొట్టారు" అన్నాడు కోపంగా. దానికి ఓనర్, "ఖాళీ చేశారు, కానీ నా బంగారం లాంటి పాయాఖానా నీ ఖూనీ కూడా చేశారు, నా ఇల్లు, అదే అదే పయాఖానా కట్టించి ఇచ్చేదాక మిమ్మల్ని వదల్ను" అని అన్నాడు వీరంగం వేస్తూ. ఇది విన్న వెంటనే బప్పం గవ్వాన్న కాసి చూసాడు అనుమానంగా... అయితే గవ్వగాడేమో "నేను కాదు, నాకు తెలియదు" అన్నట్టు దిక్కులు చూస్తున్నాడు. బప్పంకీ బర్రెక్కువ కదా, "వీడు ఏదో చేశాడు" అని అనుకొని, ఓనర్‌తో మాట్లాడడం మొదలుపెట్టాడు, "ఎం జరిగిందో మాకు తెలియదు!" అన్నాడు. దానికి ఓనర్, నీ అన్నని అడుగు, నిన్న మూడుగంటలకి రూం కి ఎందుకు వచ్చాడో" అన్నాడు. అంతే, గావ్వాగాడు "నేను ఎక్కడ వచ్చాను? నేను ఆఫీస్ లో ఉన్న, చెప్పరా బప్పం. అయినా నేను అక్కడ ఉన్నా అని మీ దగ్గర ఆధారం ఎన్టీ?" అని అడిగాడు. అప్పం బప్పం ఒకరి మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. గవ్వగాడేమొ, చూసారా ఎంత తెలివిగా అడిగానో? అన్నట్లు చూస్తున్నాడు ఇద్దరి కాసి. ఓనర్, గవ్వగాడికేసి చూస్తూ, నెమ్మదిగా కుడివేపు తిరిగి, బుజ్జి చెప్పరా అని అన్నాడు. బుజ్జిగాడు అన్నాడు, "నిన్న ఈ అన్న మధ్యాహ్నం రూమ్ నుంచి బ్యాగ్ వేసుకొని దిగుతూ కనిపించాడు. చొక్కా అంతా ఏంటో మరకలు ఉన్నాయి." అన్నాడు. బప్పంకీ మొత్తం అర్దం అయ్యింది. ఇంకా వాదించకుండా, అయ్యా మేము మొత్తం ఖర్చు భరిస్తాం ఇక్కడ అల్లరి చెయ్యకండి అని ఒప్పించి పంపించాడు.
అందరూ వెళ్ళాక, అప్పం బప్పం, గవ్వాగాడిని నిలదీశారు, "ఒరేయ్, నిన్న నువ్వు వేసుకెళ్ళినప్పుడు ఒక చొక్కా, మళ్లీ రాత్రి ఇంటికి వచ్చినప్పుడు వేరే చొక్కా ఉంది, ఏమొలే సరిగా గుర్తులేదు అనుకోని అడగలేదు. అసాలెం జరిగిందో చెప్పు?" అని. వెంటనే అప్పం గాడు అందుకొని, "అయినా ఇటువంటి పనిచేసి దొరక్కుండా ఉంటానని ఎలా అనుకున్నావు?" అన్నాడు.
గవ్వగాడు ఎమ్మాట్లాడకుండా గదిలోకివెళ్ళాడు, తిరిగి బ్యాగుతో వచ్చి కూర్చొని చెప్పడం మొదలుపెట్టాడు. "అంటే, ప్రొద్దున్నే ఆఫీస్ సంతకం పెట్టా, భోజనం తరువాత కాపలావాడి కళ్ళు గప్పి, చాలా తెలివిగా సంతకం పెట్టకుండా తప్పించుకుని వచ్చా ..." చెప్పడం ఆగిపోవడంతో అప్పం, భప్పం తలలు పైకెత్తి చూసారు. గవ్వగాడు తనలోతాను నవ్వుకుంటూ సిగ్గుపడుతున్నాడు. బప్పం గాడు "అబ్బ నువ్వు సిగ్గుపడటం ఆపరా...చూడలేక చస్తున్నాం" అన్నాడు. దానికి గావ్వగాడూ తేరుకొని. "అంటే ఓనర్ కి నా మీద అనుమానం వస్తే ఆధారంగా పనికొస్తుంది అనీ..." అన్నాడు. అప్పం గాడు, ఇంతకీ ఆ సంచిలో ఏముంది రా?" అన్నాడు. దానికి గవ్వగాడు దానిలోంచి సుత్తి తీసాడు. అంతే, బప్పంగాడు నేలమీద పడి బురదలోదొర్లిన పందిలా నవ్వటం మొదలుపెట్టాడు. అప్పం గాడు, "ఎందుకురా ఇలా?" అని అడిగాడు. దానికి గవ్వగాడి చెప్పిన సమాధానం......పగ....పగ... పగా....
సమాప్తం.