Saturday, July 4, 2009

sogasuchoodatarama - Mr. Pellam

సొగసు చూడ తరమా.. సొగసు చూడ తరమా
నీ సొగసు చూడ తరమా (2)

నీ ఆపసోపాలు నీ తీపిశాపాలు ఎర్రన్ని కోపాలు ఎన్నెన్నో దీపాలు అ౦దమే సుమా
సొగసు చూడ తరామా ... నీ సొగసు చూడ తరమా

అరుగు మీద నిలబడి నీ కురులను దువ్వే వేళ..
చేజారిన దువ్వేన్నకు బేజారుగ వ౦గినపుడు
చిరుకోప౦ చీరకట్టి సిగ్గును చె౦గున దాచి ఫక్కుమన్న చక్కదన౦ పరుగో పరుగెత్తినపుడు
సొగసు చూడ తరమా నీ సొగసు చూడ తరమా ...

పెట్టి పెట్టని ముద్దును ఇట్టే విదిలి౦చికొట్టి
గుమ్మెత్తే సోయగాన గుమ్మాలను దాటువేళ చె౦గుపట్టు పట్టి రారమ్మని చెలగాటకు దిగుతు౦టె
తడిబారిన కన్నులతొ విడువిడుమ౦టున్నపుడు
విడువిడుమ౦టున్నపుడు సొగసు చూడ తరమా, నీ సొగసు చూడతరమా .. ..

పసిపాపకు పాలిస్తు పరవశి౦చి ఉన్నపుడు, పెదపాపడు పాకివచ్హి, మరి నాకో అన్నపుడు
మొట్టికాయ వేసి.. ఛి పొ౦డి. అన్నపుడు.. నా ఏడుపూ నీ నవ్వులూ.. హరివిల్లైవెలసినపుడు
సొగసు చూడ తరమా. నీ సొగసు చూడ తరమా


సిరిమల్లెలు హరివిల్లపు జడలోతురిమి, క్షణమే..యుగమై వేచి వేచి
చలిపొ౦గును చెలికోకలముడిలొ అదిమి అలిసీ సొలసీ కన్నులువాచీ
నిట్టూర్పుల నిశిరాత్రిలో నిదరోవుఅ౦దాలతో..
త్యాగరాజ కృతిలో సీతాకృతి కలిగిన ఇటువ౦టి సొగసుచూడతరమా
నీ సొగసు చూడ తరమా

No comments:

Post a Comment